ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్‌లు చుట్టూ తిరుగతుంటే.. మరికొందరు కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారు. అయితే, చాలా మంది జిమ్‌లో కష్టపడుతున్నా.. కఠినమైన డైట్ ఫాలో అవుతున్నా సరైన ఫలితం ఉండటం లేదు. అయితే, శరీరంలో కొవ్వు తగ్గించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగించే ఫుడ్స్ ఏంటో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు.
అయితే, ఫ్యాట్‌ని కరిగించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగించడంలో ప్రోటీన్, ఫైబర్ రెండూ కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, ఈ రెండూ శరీరంలో భిన్నమైన పద్ధతుల్లో పనిచేస్తాయని శ్రీమతి అదితి ప్రసాద్ ఆప్టే (సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్, ఆస్టర్ RV హాస్పిటల్, బెంగళూరు) తెలిపారు. ప్రోటీన్ లేదా ఫైబర్ రెండింటిలో కడుపు నిండిన భావన కలిగించి కొవ్వు కరిగించడంలో సాయపడేది ఏంటో తెలుసుకుందాం.


