ప్రెగ్నెన్సీ సమయంలో సెప్సిస్ చాలా ప్రమాదకరం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తల్లి, బిడ్డకు క్షేమం కాదు. అందుకే ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని లక్షణాలు గర్బిణీ మహిళతో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక, సెప్సిస్ నిర్ధారణ అయిన లేదా తీవ్ర అనుమానం ఉన్న మొదటి 1 గంటలోపు వైద్యులు IV యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ అందించడం ప్రారంభిస్తే తల్లీబిడ్డల ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుంది. సెప్సిస్ గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ వై. దివిషా రెడ్డి అందించారు.


