HomeAndhra Pradeshపెళ్లి చేయడం లేదని తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు..!!

పెళ్లి చేయడం లేదని తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు..!!

పెళ్లి చేయడం లేదని తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు..!!

తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో తన తల్లి ఇంటికి ఓ కుమారుడు నిప్పంటించాడు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో జరిగిందీ ఘటన.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కుమారులతో గూడెంచెరువులో నివాసించేవారు. ఇటీవలే వరలక్ష్మి రెండో కుమారుడికి వివాహమైంది. వయసులో తనకంటే చిన్నవాడికి ముందు పెళ్లి జరగడం పెద్ద కుమారుడు సురేంద్రకు నచ్చలేదు. ఆ తరువాత తనకూ వివాహం జరిపించాలని అతడు తల్లిని అడగడం మొదలుపెట్టాడు. కొన్ని కారణాల వల్ల సురేంద్రకు పెళ్లి సంబంధాలు రాలేదు. దీంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు.పెళ్లయిన రెండో కుమారుడు వేరు కాపురం పెట్టాడు. తల్లి మీద కోపంతో పెద్ద కుమారుడూ వేరే ఇంట్లో నివసిస్తున్నాడు. నిన్న (బుధవారం) రాత్రి వరలక్ష్మి లేని సమయంలో ఆమె ఉండే ఇంటికి సురేంద్ర నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించలేదని సిబ్బంది తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments