తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప పేరుతో తొలిసారి సభ నిర్వహించిన ఆమె.. బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను ఏ తప్పూ చేయకున్నా జైలులో పెట్టారని, పార్టీ కోసం ఇలా చేశారని బీఆర్ఎస్ పెద్ద నాయకులే అన్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రశాంత్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన శకునిలా మమ్మల్ని విడదీశారని చెప్పారు.


