AP Govt Declared Pada As Autonomous Body: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మరో గుర్తింపు దక్కింది. పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పాడా)ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా గుర్తించారు. పాడా ప్రత్యేక సంస్థగా కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవహరిస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాడాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


