మనం వాడి పారేసే వస్తువుల్ని ఎన్నో రకాలుగా వాడొచ్చు. కొన్ని వస్తువులు మనకి అవసరం అని కొనుక్కుని ఆ తర్వాత వాటి పనితీరు తగ్గాక వేస్ట్ అని పారేస్తుంటాం. అలా కాకుండా వాటిని మనం ఇంట్లోనే కొన్నిరకాలుగా వాడొచ్చు. అలాంటి వాటిలో పాత వైర్లు కూడా ఉంటాయి. సన్నని వైర్స్ దగ్గర్నుంచీ కాస్తా మందంగా ఉండే వైర్లు కూడా ఉంటాయి. కేవలం కరెంట్ వైర్లు మాత్రమే కాదు, ఛార్జర్ కేబుల్స్, ఇయర్‌ఫోన్స్, ఎక్స్టెన్షన్స్ కార్డ్స్, టీవీ వైర్ల వంటి వాటిని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు.


