దేశవ్యాప్తంగా నవరాత్రుల సందడి నెలకొంది. ఇక సెలవుల సందర్భంగా ప్రతి ఇంటికి బంధువుల రాక మొదలైంది. ఈ సమయంలో రకరకాల పిండి వంటలు వండుకుని ఆస్వాదిస్తారు. ఇక నవరాత్రుల ఉపవాస దినాల్లో సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలు చేస్తుంటారు. సగ్గుబియ్యం పాయసం (పరమాన్నం), వడలు, కిచిడీ వంటివి ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సగ్గుబియ్యం నానబెట్టడంలో చేసే చిన్న తప్పు మొత్తం వంటకం రుచిని, రూపాన్ని పాడుచేస్తుంది.
చాలామందికి సగ్గుబియ్యం వండేటప్పుడు ముద్దగా, జిగటగా మారిపోవడం లేదా లోపల గట్టిగా ఉండిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం సగ్గుబియ్యాన్ని సరైన పద్ధతిలో, సరైన నీటి కొలతతో నానబెట్టకపోవడమే. సగ్గుబియ్యం పూసల్లా విడివిడిగా, పర్ఫెక్ట్గా నానాలంటే ఎంతసేపు నానబెట్టాలి, సరైన పద్ధతి ఏంటో ఇక్కడ చూద్దాం.


