మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సంకేతాలను చేరవేయడంలో నరాలు కీలక పాత్ర పోషిస్తాయి. మెదడు నుంచి చేతులు, కాళ్లు, కండరాలు, ఇతర అవయవాలకు సంకేతాలను చేరవేయడం నుంచి స్పర్శ, కదలికలను నియంత్రించడం, శరీరంలోని అనేక విధులు సక్రమంగా సాగడం కూడా నాడీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఈ విషయంలో మఖానా (ఫాక్స్‌నట్స్/లోటస్ సీడ్స్) ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడవచ్చని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. మఖానాలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం నరాలు, కండరాల సాధారణ పనితీరులో సహాయపడుతుంది. అంతేకాదు మఖానాలో కొన్ని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. మరి ఫూల్ మఖానా డ్రై రోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి? దీన్ని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


