HomeEntertainmentదేశవ్యాప్తంగా ‘సర్’ ప్రకంపనలు.. ఓట్ల లెక్కతో మొదలైన సరికొత్త జాతీయ రాజకీయం!

దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రకంపనలు.. ఓట్ల లెక్కతో మొదలైన సరికొత్త జాతీయ రాజకీయం!

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విపక్ష పార్లమెంటు సభ్యుల ర్యాలీతో వీధులన్నీ మారుమోగాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్‌ను తప్పించాలన్న డిమాండ్‌తో విపక్ష ఎంపీలు ర్యాలీ చేయడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడంతోపాటు మొబైల్ డేటాను పని చేయకుండా చేశారు. పార్లమెంటు భవనం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం భవనం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పోలీసులతో రాహుల్‌, ప్రియాంక వాగ్వాదానికి దిగారు. బస్సులో నుంచి దిగడానికి రాహుల్, ప్రియాంక ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఇద్దరినీ వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని… SIR రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఉదయం నుంచి ఇండియా కూటమి ఎంపీలు మధ్యాహ్నం వరకు నిరసన ప్రదర్శించారు. మధ్యాహ్నం నుంచి ఆకాశవాణి భవణ్‌ దగ్గర బైఠాయించారు. అసలు SIR పై విపక్షాలు ఎందుకు నిరసన చేపట్టాయో… అధికార బీజేపీ దీన్ని ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments