రెండు రోజుల కిందట ముంబయిలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో దుండుగుల కాల్పుల నుంచి యువ నటుడు త్రుటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు వెల్లడించిన సమాచారంతో పోలీసులు విస్తుపోయారు. వాస్తవానికి టైగర్‌ను చంపడం వారి మొదటి లక్ష్యం కాదని, వేరే సెలబ్రిటీ కోసం రెక్కీ నిర్వహించినట్టు ముగ్గురూ చెప్పారని తెలిసింది.


