డోర్నకల్–గద్వాల మధ్య 308.28 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేబోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి షరతు విధించింది. రూ.8,993.77 కోట్ల అంచనా వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వాటా భరించాలని స్పష్టం చేసింది. భూసేకరణ సమస్యల కారణంగా ప్రాజెక్టు ఎలైన్మెంట్ మార్చడంతో దూరం 296 కిలోమీటర్ల నుంచి 308.28 కిలోమీటర్లకు పెరిగింది. మార్చి 31న డీపీఆర్ సమర్పణ అనంతరం వ్యయం, నిర్వహణ, ఆదాయ అవకాశాలను రైల్వేబోర్డు పరిశీలించింది. ఇదే ప్రాంతంలోని డోర్నకల్–మిర్యాలగూడ రైల్వే లైన్ డీపీఆర్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది.


