తెలంగాణలో మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు నిర్మించతలపెట్టిన హైవేపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ప్రతిపాదిత మార్గంలో సుల్తానాబాద్ బైపాస్‌ను కూడా మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. మంథని నియోజకవర్గంలో రూ.800 కోట్లకు పైగా రహదారి పనులకు నిధులు మంజూరయ్యాయని, 18 నెలల్లో ఆయన పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.


