HomeTELANGANAతెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ.30.. 12 ఏళ్ల తర్వాత కొత్త రేట్లు

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ.30.. 12 ఏళ్ల తర్వాత కొత్త రేట్లు

తెలంగాణలో ఆటో ప్రయాణికులకు కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ రేట్లను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14గా నిర్ణయించారు. డిటెన్షన్ ఛార్జీ నిమిషానికి 75 పైసలకు పెరిగింది. నిబంధనలకు లోబడి అదనపు లగేజీకి ఒక్కో ప్యాకేజీకి 50 పైసలు వసూలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాలి. కొత్త రేట్లకు అనుగుణంగా మీటర్లు సవరించుకునేందుకు ఆటో డ్రైవర్లకు 3 నెలల గడువు ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments