HomeAndhra Pradeshతిరుమల భక్తులకు టీటీడీ భారీ భరోసా: సహజ మరణాలకు రూ. 2 లక్షల బీమా

తిరుమల భక్తులకు టీటీడీ భారీ భరోసా: సహజ మరణాలకు రూ. 2 లక్షల బీమా

తిరుమల భక్తులకు టీటీడీ భారీ భరోసా: సహజ మరణాలకు రూ. 2 లక్షల బీమా

‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకంతో భక్తులకు భరోసా

‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం కింద తిరుమలలో సహజ మరణానికి రూ. 2 లక్షలు, ప్రమాద మరణానికి రూ. 10 లక్షల బీమా అమలు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు

ఏడుగురు భక్తుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బీమా చెక్కులను పంపిణీ చేశారు. దర్శనం టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారితో పాటు నేరుగా వచ్చే భక్తులందరికీ ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది.

టికెట్ లేని భక్తులకూ బీమా

టికెట్ లేనివారు క్యూలైన్లలోకి రాగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతికతతో గుర్తించి బీమా పరిధిలోకి చేరుస్తారు. భక్తులతో పాటు తిరుమలలో సేవలందించే ‘శ్రీవారి సేవకుల’కూ ఈ బీమా వర్తిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments