HomeAndhra Pradeshతిరుమలలో ఒక్కసారిగా భారీ వర్షం.. అలర్ట్ జారీ చేసిన టీటీడీ

తిరుమలలో ఒక్కసారిగా భారీ వర్షం.. అలర్ట్ జారీ చేసిన టీటీడీ

తిరుమలలో ఒక్కసారిగా భారీ వర్షం.. అలర్ట్ జారీ చేసిన టీటీడీ

తిరుమల:

తిరుమల తిరుపతి కొండపై బుధవారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీనికి తోడు చలి, పొగమంచు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు, వాహనదారులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక హెచ్చరికలు జారీ చేసింది.

ఘాట్ రోడ్లపై మలుపులు ఎక్కువగా ఉండటంతో పాటు వర్షం వల్ల రోడ్లు తడిసి ఉండటం వల్ల జారే ప్రమాదం ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించింది. తిరుమలలో వర్షం, చలి గాలులు వీస్తుండటంతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది.

ఘాట్ రోడ్లలోని ప్రమాదకరమైన మలుపుల వద్ద వాహనాలు జారే ముప్పు పొంచి ఉందని తెలిపింది.ఘాట్ రోడ్లపై ప్రయాణించే డ్రైవర్లు వాహనాలను నెమ్మదిగా నడపాలి. లో-బీమ్ హెడ్లైట్లను వినియోగించాలి. ఓవర్టేకింగ్, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం పూర్తిగా నివారించాలి. వాహనాల మధ్య తగినంత సురక్షిత దూరాన్ని పాటించాలి.

ఇదిలా ఉంటే వర్షం కారణంగా తిరుమల కాలినడక మార్గంలోని మెట్లు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా అడుగులు వేయాలి. యాత్రికులు తమ వెంట తప్పనిసరిగా రెయిన్‌కోట్లు, వెచ్చని దుస్తులు తెచ్చుకోవాలి. ప్రయాణ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకుని అదనపు సమయం కేటాయించుకోవాలి. అత్యవసర సహాయం కోసం టీటీడీ హెల్ప్ లైన్ నంబర్ 155257 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments