AP Govt Rice Outlet Started In Delhi Ap Bhavan: ఢిల్లీలోని ఏపీ భవన్లో రైస్ అవుట్లెట్ ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు కేఎన్ఎం, బీపీటీ వంటి రకాల బియ్యాన్ని కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఇటు ఎన్సీసీఎఫ్ ద్వారా సేకరించిన 64 రకాల నాణ్యమైన సరుకులను కూడా సబ్సిడీ రేట్లతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.


