ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ.. తన స్వగ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోక్సో కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ఆ ఖైదీ.. ఆస్పత్రి నుంచి పరారై స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతడు చెరువు గట్టుపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి తప్పించుకున్న అతడిని పోలీసులు పట్టుకోగా.. తాజాగా మరోసారి పారిపోయి ప్రాణాలు తీసుకున్నాడు.


