ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చెన్నై మెట్రో రెండో దశను ప్రారంభించారు. అనంతరం సీఎం విజయ్‌తో కలిసి ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఇప్పటికే చెన్నై నగరంలో 54.1 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ అందుబాటులో ఉంది. రెండో దశలో 118.9 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. అయితే రెండో దశ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2028 నాటికి రెండో దశ పూర్తి చేయాలని చెన్నై మెట్రో లక్ష్యంగా పెట్టుకుంది.


