ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఈ కార్యక్రమానికి కేతిరెడ్డి దూరంగా ఉన్నారు. అయితే సోమవారం ఉదయం.. పట్టణంలోని చేనేత ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధి అందుతోందా లేదా అనేది వాకబు చేశారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గుడ్ మార్నింగ్ ధర్మవరం.. మళ్లీ మొదలెట్టిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. టార్గెట్ అదేనా?
RELATED ARTICLES


