ఇరాన్‌తో యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. దీంతో ఇంధనం ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికన్లలో ట్రంప్ సర్కారు పట్ల వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మార్కెట్లోకి ఇంధన సరఫరా పెంచడం కోసం అమెరికా మార్గాలను అన్వేషిస్తోంది. వెనిజులాలో ఉత్పత్తయ్యే హెవీ క్రూడాయిల్ మార్కెట్లోకి వస్తే కొంత ఊరట లభిస్తుందని భావిస్తోన్న అగ్రరాజ్యం.. దాన్ని శుద్ధి చేయడం కోసం జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ వైపు చూస్తోంది.


