కోల్కతాలో దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 19 మంది చనిపోగా 25 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ తొక్కిసలాటకు నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, గందరగోళానికి గురి చేసేలా ప్రకటనలు చేయడమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మండపం కూలిపోతుంది.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చేసిన ప్రకటనతో భయాందోళనలకు గురైన భక్తులు పరిగెత్తే క్రమంలో తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.
కోల్కతా: ‘మండపం కూలిపోతుంది.. వెళ్లిపోండి’.. 19 మంది చనిపోవడానికి ఈ ప్రకటనే కారణమైందా?
RELATED ARTICLES


