కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ విచారణ ప్రారంభమైంది. మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు పాత రెవెన్యూ రికార్డులు, సర్వే నంబర్లు, ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్ పరిధిలో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. భూముల గత, ప్రస్తుత పరిస్థితులను పోల్చేందుకు శాటిలైట్ చిత్రాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.


