HomeAndhra Pradeshకేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్న 45 మంది ఏపీవాసులు

కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్న 45 మంది ఏపీవాసులు

చార్‌ధామ్‌యాత్రలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మార్గంలో రాళ్లు, శిథిలాలు పేరుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దాంతో వందలాదిమంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. అందులో ఆంధ్రాకు చెందిన 45 మంది కూడా ఉన్నారు. వీరంతా దర్శనాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఇది జరిగింది. కాగా ఇప్పటికే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments