ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) తమ జట్టు ప్రధాన కోచ్‌గా కీరన్ పొలార్డ్‌ను నియమించింది. గత వారం తప్పుకున్న మహేలా జయవర్ధనే స్థానంలో పొలార్డ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2010 నుంచి ముంబై జట్టుతో ఆటగాడిగా, ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా ప్రయాణం చేసిన పొలార్డ్, ఇప్పుడు హెడ్‌కోచ్‌గా పదోన్నతి పొందడం విశేషం. ఎంఐ హెడ్ కోచ్‌గా నియమితుడు కావడంపై పొలార్డ్ సంతోషం వ్యక్తం చేశాడు.


