HomeAndhra Pradeshకాకినాడ బీచ్‌లో యువకులు గల్లంతు.. స్పందించిన పవన్ కళ్యాణ్, రంగంలోకి గజ ఈతగాళ్లు

కాకినాడ బీచ్‌లో యువకులు గల్లంతు.. స్పందించిన పవన్ కళ్యాణ్, రంగంలోకి గజ ఈతగాళ్లు

కాకినాడలోని గుర్రాల బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మొత్తం నలుగురు స్నేహితులు స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేశారు. దాంతో గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments