HomeTELANGANAకరెంటు మీటర్ల కోసం లంచం.. రూ.1.20 లక్షలతో ఏసీబీకి చిక్కిన మాదన్నపేట విద్యుత్‌ శాఖ ఏఈ

కరెంటు మీటర్ల కోసం లంచం.. రూ.1.20 లక్షలతో ఏసీబీకి చిక్కిన మాదన్నపేట విద్యుత్‌ శాఖ ఏఈ

హైదరాబాద్‌లో విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఏసీబీకి చిక్కారు. రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పాత విద్యుత్‌ మీటర్ల స్థానంలో కొత్త మీటర్ల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తును ఆమోదించేందుకు డబ్బులు డిమాండ్‌ చేసి దొరికిపోయారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు.. పక్కా పథకం ప్రకారం ట్రాప్‌ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా, లంచం డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు 1064 నంబర్‌ను ఉపయోగించాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments