బొల్లారంలో ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ వాసులు డీసీపీ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టడం సంచనలంగా మారింది. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ను.. పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. భయంతో ఆ చిన్నారిని చంపేసి.. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని నీటి సంపులో పడేసినట్లు పేర్కొన్నారు.


