ఉమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి చేసిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్ వైపు వెళ్లాలని ఆవేశంగా సైగలు చేసినందుకు గానూ ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఐసీసీ కేటాయించింది. మ్యాచ్ రెఫరీ ప్రతిపాదించిన ఈ శిక్షను ఫాతిమా సనా అంగీకరించింది.


