ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ముగ్గురు పసికందులు మృతి చెందగా.. తాజాగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు శిశువులు కూడా చనిపోయారు. ఏసీ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై నిపుణుల కమిటీతో విచారణ, ఆడిట్లకు ఆదేశించింది. ఇక.. ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు స్వీకరించి సమగ్ర నివేదిక కోరింది.


