
తెలంగాణలో బైక్ ట్యాక్సీలకు పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పందించారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా అదనపు ఆదాయం కోసం ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తున్న యువతపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. పార్ట్‌టైమ్ రైడర్ల ఉపాధి దెబ్బతినకుండా ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా రైడర్లకు భద్రత, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


