HomeTELANGANAఅల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో జోరు వానలు

అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో జోరు వానలు

దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో వర్షాల తీవ్రత గరిష్ఠంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు వెల్లడించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించనున్నాయన్నారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఒకట్రెండు విడతలుగా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, దక్షిణ తెలంగాణలో ప్రభావం తక్కువగా ఉండనుందని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments