Agrigold Plots Removed From Prohibited List: అగ్రిగోల్డ్‌పై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ మేరకు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రధానంగా అగ్రిగోల్డ్ కేసుల పురోగతి, బాధితులకు న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. తొలి విడతలో 35,444 మంది బాధితులకు లబ్ధి చేకూరేలా.. 6,989 మంది బాధితుల భూములకు రెండో విడతలో ఊరట దక్కేలా నిర్ణయం తీసుకున్నారు.
అగ్రీగోల్డ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఊరట.. 35,444 మందికి లబ్ధి, త్వరలో 6,989 మందికి రిలీఫ్!
RELATED ARTICLES


