హైదరాబాద్ సమీపంలో ఆది మానవుల ఆనావళ్లు కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిలుకూరు మృగవాణి నేషనల్ పార్కులో నాలుగు రాతి గాడులు గుర్తించారు. బండ జువ్వి వాచ్ టవర్ సమీపంలోని రాతిపై ఉన్న ఈ గాడులు.. పనిముట్లను సానబెట్టడానికి ఉపయోగించి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. మరోవైపు ఫారెస్ట్ ట్రెక్ పార్కు సమీపంలోని పాము పడగ ఆకారపు శిలపై తాబేలు, వేట దృశ్యాలు, బాణాలు వంటి రూపాలతో కూడిన కాషాయ వర్ణ చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.


