అమస్టెల్వీన్ వేదికగా జరిగిన హాకీ ప్రపంచకప్ 2026 పూల్-డి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను భారత్ 5-3 తేడాతో చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో భారత్ టోర్నీలో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో రాణించగా, హార్దిక్ సింగ్ ఒక గోల్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజా ఫలితంతో పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


