ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై అటు ప్రతిపక్షాలు, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ సమాంతరంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతోంది. ఇక, సీజేపీ తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి సిద్ధమైంది. అక్టోబరు 10 నాటి నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో.. శుక్రవారం కన్నాట్ ప్లేస్లో మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే, దీనిని అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.


