ICICI Prudential AMC: దీర్ఘకాలంలో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ వల్ల లాంగ్ రన్‌లో సంపద విశేషంగా పెరుగుతుందని చెబుతుంటారు. దీనికి నిదర్శనంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ నిలిచింది. ఇది రూ. 10 వేల సిప్ పెట్టుబడిని 22 ఏళ్లలో ఏకంగా రూ. 2 కోట్లకుపైగా చేయడం విశేషం.



