వయసు పెరుగుతుంటే చర్మంపై ముడతలు రావడం మాత్రమే కాదు.. శరీరంలోనూ ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే వయసు పెరిగిన తర్వాతే ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం 20, 30 ఏళ్ల వయసులోనే పాటించే కొన్ని అలవాట్లు తర్వాతి సంవత్సరాల్లో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. యాంటీ ఏజింగ్ అంటే ఖరీదైన క్రీములు, సప్లిమెంట్స్ లేదా ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్స్ మాత్రమే కాదు.
యాంటీ ఏజింగ్ అంటే కేవలం యవ్వనంగా కనిపించడం కాదు.. వయసు పెరిగినా శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేలా వయసులో ఉన్నప్పటి నుంచే జాగ్రత్త పడటం. మనం రోజూ ఏం తింటున్నాం? ఎంతసేపు నిద్రపోతున్నాం? ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాం? శరీరాన్ని ఎంతవరకు కదిలిస్తున్నాం? వంటి సాధారణ విషయాలు కూడా హెల్తీ ఏజింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఆరోగ్యంగా వయసు పెరగాలంటే ఏ విషయాల్లో శ్రద్ధ పెట్టాలి? తెలుసుకుందాం..


