మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను తిరిగి పార్లమెంటు ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. బిల్లుల ఆమోదానికి రాజ్యాంగపరమైన ప్రత్యేక మెజారిటీ అవసరం కావడంతో కేంద్రం.. ప్రాంతీయ, చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఎంకేతో సంప్రదింపులు జరుగుతున్నాయనే వార్తలు కూడా వెలువడ్డాయి.


