HomeTELANGANAమంత్రి కోమటిరెడ్డి అడిగితే తల నరుక్కొని నా ప్రాణమైనా ఇస్తా.. కానీ ఆ విషయంలో మాత్రం...

మంత్రి కోమటిరెడ్డి అడిగితే తల నరుక్కొని నా ప్రాణమైనా ఇస్తా.. కానీ ఆ విషయంలో మాత్రం తగ్గేదే లేదు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

పాలమూరు ప్రాంత నీటి హక్కుల విషయంలో రాజీపడబోనని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ గురువైనప్పటికీ.. అవసరమైతే నీటి కోసం ఆయనతోనైనా పోరాడతానన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. ముందుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరుకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. జేఏసీ జలదీక్షకు మద్దతు ప్రకటిస్తూ, పాలమూరు ఎమ్మెల్యేలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments