
అమరావతి:
బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా తుపాన్లు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని తెలుస్తోంది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుపైనా ఉండే అవకాశం ఉంది.తుపాను ఏర్పడటం, దాని దిశ, తీవ్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.


