HomeAndhra Pradeshపూజలు చేసిన రోజే అపశృతి.. సలసలా కాగుతున్న ఉక్కు లీక్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తృటిలో...

పూజలు చేసిన రోజే అపశృతి.. సలసలా కాగుతున్న ఉక్కు లీక్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తృటిలో తప్పిన మహా ప్రమాదం

స్టీల్‌ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఎస్‌ఎంఎస్‌-1 సీసీడీ విభాగంలో ద్రవ రూపంలో సలసలా కాగుతున్న ఉక్కును తరలించే ల్యాడిల్ గేటు సరిగ్గా క్లోజ్ కాకపోవడంతో వేడి వేడి ఉక్కు ద్రవం నేల మీద పడింది. ఆ సమయంలో సిబ్బంది వెంటనే అప్రమత్తమైన దూరంగా జరిగిపోయారు. దాంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అక్కడున్న కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో పదే పదే జరుగుతున్న యాక్సిడెంట్లపై సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇలాంటివి జరగక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments