SIR ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీ జరుగుతోందని, లౌకికవాదుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు ఉన్నాయని ఆరోపించారు. నిజామాబాద్లో తన ఓటును తొలగించేందుకు కుట్ర చేశారని, తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎన్నికల సంఘంపై చర్యల కోసం మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. SIRకు వ్యతిరేకంగా సోమవారం అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


