తెలంగాణలో నిషేధిత జాబితా భూముల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌తోపాటు.. చుట్టుపక్కల జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న ప్రైవేటు ఆస్తులను కూడా 22ఏ జాబితాలో చేర్చి వేధిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ల వసూళ్ల రాకెట్ నడుస్తోందని.. భూములను జాబితా నుంచి తొలగించేందుకు దళారులు భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పొంగులేటిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


