తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్రం PMAY-G పథకం కింద తొలి విడతగా 2 లక్షల ఇళ్లను కేటాయించింది. రాష్ట్రంలో ఆవాస్ సర్వే ద్వారా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించగా.. వారికి ఇళ్లను మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతున్న నేపథ్యంలో PMAY-G ఇళ్లు తోడైతే పేదలకు పక్కా నివాసంతోపాటు మరుగుదొడ్డి, ఇతర ప్రాథమిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలతో ప్రయోజనం కలగనుంది.


