HomeTELANGANAతీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నం వరకు అక్కడక్కడ వర్షాలు కొనసాగవచ్చునని చెప్పారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చునని అన్నారు. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments