భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ 2027 సీజన్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఇటీవలి కాలంలో అభిషేక్ శర్మ వంటి యంగ్ హిట్టర్లను తీర్చిదిద్దిన యువీకి ఇది మొదటి అధికారిక ఐపీఎల్ కోచింగ్ బాధ్యత కావడం గమనార్హం. ఢిల్లీ హెడ్ కోచ్గా నియమితుడైన తన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో యువీ కలిసి పనిచేయనున్నాడు. తొలి ఐపీఎల్ ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా యువీ అనుభవాన్ని ఢిల్లీ యాజమాన్యం ఉపయోగించుకోనుంది.


