HomeEntertainmentకోలీవుడ్‌లో మరో రాజకీయ సంచలనం.. 'తమిళగ ఎళుచ్చి కళగం'తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ధనుష్!

కోలీవుడ్‌లో మరో రాజకీయ సంచలనం.. ‘తమిళగ ఎళుచ్చి కళగం’తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ధనుష్!

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ఆయన కొత్త రాజకీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాలను బలోపేతం చేస్తూ, ప్రత్యేక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేసుకున్న ధనుష్, ఇటీవల అభిమానులు రూపొందించిన పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. 2031 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని, మామ రజినీకాంత్ నైతిక మద్దతుతో బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments