కాంగ్రెస్ పాలిత, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ టార్గెట్ చేసిందని, ఇటీవల తనతో పాటు కేరళ సీఎంపై స్టింగ్ ఆపరేషన్ ప్రయత్నాలు జరిగాయని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం సిద్ధరామయ్య వీడియోలు కన్నడ నాట వివాదం రేపుతోన్న వేళ.. డీకే వ్యాఖ్యలు రావడం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
కేరళ సీఎంతో పాటు నాపై మెటా గ్లాసెస్‌తో స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
RELATED ARTICLES


