వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఓటమిపాలవ్వడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. అసలు కుల్దీప్ను డ్రాప్ చేయడంలో మేనేజ్మెంట్కు ‘కామన్ సెన్స్’ కొరవడిందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఘాటుగా స్పందించాడు.


