మాదాపూర్ ఓయో హోటల్లో యువతి మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడైన శ్రీనివాస రవితేజ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే రవితేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్, రోడ్ నెంబర్ 5లో ఉన్న ఓయో హోటల్ రూమ్‌లో షారోన్ నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్లో యువతి మృతి కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాస రవితేజ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతను తన స్వగ్రామమైనా ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస రవితేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పరవాడ పోలీసులు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు తెలియజేశారు.
అసలు ఈ ఓయో కేసు ఏంటంటే?
విశాఖపట్నానికి చెందిన నిఖిత టోప్నో, శ్రీనివాస రవితేజ కలిసి సెప్టెంబర్ 21వ తేదీన మధ్యాహ్నం మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్, రోడ్ నెంబర్ 5లో ఉన్న ఓయో హోటల్లో రూమ్ తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో రవితేజ, హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అలా చనిపోయిన నిఖిత యువతి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
హోటల్ గదిని క్లూస్ టీమ్ పరిశీలించగా గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు, గదిలో ఖాళీ మద్యం సీసాలు కూడా కనిపించాయి. దీంతో నిఖిత మృతి అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఖిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించిన వెంటనే శ్రీనివాస రవితేజ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దాంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగానే, అతను తన సొంత ఊరు వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఫోరెన్సిక్ రిపోర్టులు, CC TV ఫుటేజీ ఆధారంగా మాదాపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా ఈ కేసులో ఏం జరిగిందో? నిఖిత ఎలా చనిపోయిందో? ఇంకా తేలాల్సి ఉంది.


